: ఎలిమినేటి మాధవరెడ్డిని గుర్తు చేసుకున్న చంద్రబాబునాయుడు
తెలుగుదేశం పార్టీలో ఎలిమినేటి మాధవరెడ్డి లేని లోటును మరే నేతా తీర్చలేకపోయారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మాధవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ముందుకు సాగే వ్యక్తి మాధవరెడ్డి ఒక్కరేనని కొనియాడారు. ఆయన లేని లోటు ఇప్పటికీ కనిపిస్తోందని అన్నారు. ఎలిమినేటిని ఏ శాఖకు మంత్రిగా నియమించినా, దానికి వన్నె తెచ్చేలా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరమూ పని చేయాలని, ఈ దిశగా మరోసారి ప్రతినబూనాలని పిలుపునిచ్చారు.