: చేతులెత్తి మొక్కుతూ వేడుకున్నా స్మృతీ ఇరానీ మనసు కరగలేదు: కాన్వాయ్ యాక్సిడెంట్ మృతుడి కుమార్తె
శనివారం రాత్రి యమునా ఎక్స్ ప్రెస్ వేపై కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వైద్యుడి కుమార్తె స్మృతీ ఇరానీపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రమాదం అనంతరం మంత్రి కారు దిగి బయటకు వచ్చారని, రక్తం కారుతున్న స్థితిలో తాను చేతులు జోడించి తాము ఆసుపత్రికి వెళ్లేందుకు సహకరించాలని వేడుకుంటే, ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. స్మృతీ ఇరానీ అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని తెలిపింది. తన సోదరి సైతం బతిమిలాడినా, ఆమె మనసు కరగలేదని మృతుడి కుమారుడు తెలిపాడు. కాగా, వీరి ఆరోపణలను స్మృతి కార్యాలయం ఖండించింది. బాధితులకు ఆంబులెన్స్ ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆమె ఆదేశించారని, అసలు ప్రమాదానికి ఆమె కాన్వాయ్ కారణమే కాదని వెల్లడించింది.