: ధర్మశాలలో పాక్ ఆడకూడదు: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, పాక్ కు చెందిన పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఆడకూడదని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ బాధ్యతారహిత ప్రకటన చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మశాలలో పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఆడుతుందని తాను భావించడం లేదని ఆయన అన్నారు. కాగా, ధర్మశాలలో పర్యటించిన పాకిస్థాన్ ప్రభుత్వం పంపిన ద్విసభ్య కమిటీ సీఎం వీరభద్రసింగ్, డీజీపీతో సమావేశమైంది.