: అమరావతికి వ్యతిరేకం కాదు... ‘భూదందా’పై విచారణ చేస్తారా? లేదా?: బొత్స సూటి ప్రశ్న
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే రాజధానిని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు తెర తీసిన ‘భూదందా’పై విచారణ జరిపిస్తారా? లేదా? అంటూ ఆయన ఏపీ సర్కారుకు సూటి ప్రశ్న సంధించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన భూదందాపై విచారణ జరపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విచారణతోనే వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.