: ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 7 వరకూ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 6,57,595 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 3,028 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు తెలిపారు. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ లను నివారించేందుకు 156 ఫ్లయ్యింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షా కేంద్రాలకు సాధ్యమైనంత ముందుగా చేరుకోవాలని, ఏ మాత్రం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.