: చైనాతో యుద్ధం చేయాల్సివస్తే చేతులెత్తేయాల్సిందేనా?


భవిష్యత్తులో ఎప్పుడైనా చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే... భారత సైన్యం సమర్థవంతంగా పోరాడగలదా? ఇప్పటికైతే ఆ శక్తి లేదు. చైనాతో యుద్ధమంటే, అత్యంత ప్రమాదకర హిమాలయ పర్వతాలు వేదికగా చేయాల్సి వస్తుంది. వాస్తవానికి మనవద్ద పర్వతాల్లో యుద్ధం చేయగల దళాలు సరిపడినన్ని లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూపీఏ ప్రభుత్వం 'మౌంటెన్ స్ట్రయిక్ కార్ప్స్'ను పెంచుకునేందుకు రూ. 64,678 కోట్లతో ప్రణాళికలు రూపొందించగా, ప్రస్తుత బడ్జెట్లో ఇవ్వాల్సిన నిధులను మోదీ సర్కారు ప్రకటించలేదు. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 2020-2021 నాటికి 90,274 మంది అదనపు సైనికులతో 17 పర్వత యుద్ధ దళాలను తయారు చేసే లక్ష్యంతో భారీగా నిధులను కేటాయించాలని నిర్ణయించింది. అయితే, నిధుల కొరతతో ఇప్పటి వరకూ ఆ పనులు మొదలు కాలేదు సరికదా, అత్యంత శీతల వాతావరణంలో పనిచేసే ఆయుధ సంపత్తి తయారీని రక్షణ రంగ సంస్థలు ఇంకా ప్రారంభించను కూడా లేదు. చైనాతో సరిహద్దు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో గస్తీ దళాల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో 23 లక్షల మంది సైనికులతో బలంగా ఉన్న చైనా, 3 లక్షల మందితో పర్వత యుద్ధ దళాలను సిద్ధం చేసుకునే పనిలో తలమునకలై ఉంది. వచ్చే ఏడాదికి చైనా సైన్యం సన్నద్ధమవుతుంది. ఇక భారత్ ఎప్పుడు కదిలేనో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

  • Loading...

More Telugu News