: బటన్ నొక్కితే చాలు ...అమెరికా, దక్షిణ కొరియా బూడిదైపోతాయి: ఉత్తర కొరియా


తమను రెచ్చగొడితే నిప్పులు కురిపిస్తామని, ఒక్క బటన్ నొక్కితే మీ దేశాలు నాశనమైపోయి, బూడిద మిగులుతుందని అమెరికా, దక్షిణ కొరియాలను ఉత్తర కొరియా పీపుల్స్ ఆర్మీ హెచ్చరించింది. తమ దేశంపై యుద్ధానికి దిగితే, అమెరికాతో పాటు, ఆసియా-పసిఫిక్ రీజియన్ లోనూ పెను విధ్వంసం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేసింది. నార్త్ కొరియా సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తర కొరియా చేసిన ఈ హెచ్చరికలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమను కవ్విస్తే తదుపరి క్షణంలోనే అణుబాంబులు ప్రయోగిస్తామని స్పష్టం చేసింది. కాగా, అణ్వాయుధాలను మోహరించాలని, ఏ క్షణమైనా వాటిని ప్రయోగించాల్సి రావచ్చని దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News