: నా కొడుకైనందుకే కార్తీపై వేధింపులు!: సీబీఐ దాడులపై చిదంబరం ఆవేదన


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం... తన కుమారుడు కార్తీ చిదంబరంపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై నిన్న ఆగ్రహంతో పాటు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తన కుమారుడైనందుకే కార్తీపై ఓ వైపు సీబీఐ, మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు ముప్పేట దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘అసలు టార్గెట్ నేనే. ఈ క్రమంలోనే నా కొడుకైన కార్తీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కార్తీపై కొనసాగుతున్న దర్యాప్తు సంస్థల దాడుల వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశం నాకు అర్థమవుతూనే ఉంది. తప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్న వారిపై నాకు జాలేస్తోంది. అంతిమంగా వాస్తవాలు వెలుగుచూడక తప్పదు’’ అని నిన్న ఆయన ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News