: ఫ్యాక్షన్ కు, ఫ్యాషన్ కు నాకు అర్థాలు తెలియవు: టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి కీలక వ్యాఖ్య


కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, పాలమూరు జిల్లా షాద్ నగర్ జంట హత్యల కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవించి వచ్చిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా... జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి చేరిపోయారు. సుదీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు ప్రస్తుతం టీడీపీలోనే ఇమిడిపోయారు. ఈ క్రమంలో ఆదినారాయణరెడ్డి వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేసిన రామసుబ్బారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్ కు, ఫ్యాషన్ కు తనకు అర్థాలేమిటో తెలియవని రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. కలిసిపోదామని ఓవైపు చెబుతూనే, మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఆదినారాయణరెడ్డి మనస్సు మారాల్సి ఉందని ఆయన చెప్పారు. అధినాయకులకు తెలియకుండానే గ్రామాల్లో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయని చెప్పిన రామసుబ్బారెడ్డి, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News