: భారీ షాట్లు ఆడుతున్న బంగ్లా ఆటగాళ్లు


వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పిచ్ మందకొడిగా ఉన్నప్పటికి ముందుగానే నిర్ణయించుకున్న ప్రణాళికను బంగ్లా ఆటగాళ్లు అమలు చేస్తున్నారు. టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. భారీ షాట్లకు ప్రయత్నిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే, అవుట్ ఫీల్డ్ మందకొడిగా ఉండడంతో వారు కొడుతున్న భారీ షాట్లు ఆశించిన పరుగులు ఇవ్వడం లేదు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ జట్టు 14 పరుగులు చేసింది. మ్యాచ్ 15 ఓవర్లపాటు కొనసాగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News