: నేను 3 వేల రూపాయలతో వచ్చాను... చివరికి అవే మిగిలినా పర్లేదు: నవాజుద్దీన్ సిద్దిఖీ


డబ్బు పోతుందనే బాధ తనకు లేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలిపాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నవాజుద్దీన్ మాట్లాడుతూ, తాను కేవలం 3 వేల రూపాయలతో ముంబైలో అడుగుపెట్టానని అన్నాడు. తాను ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ఆ మూడు వేల రూపాయలు మిగిలినా బాధపడనని చెప్పాడు. నటనపై ఇష్టంతో బాలీవుడ్ లో అడుగుపెట్టానని చెప్పిన నవాజుద్దీన్, డబ్బు కోసం ఇక్కడికి రాలేదని అన్నాడు. అలా డబ్బే కావాలని భావించి ఉంటే తన స్వగ్రామంలోనే ఏదైనా మిల్లు పెట్టుకుని ఉండేవాడినని తెలిపాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ కుటుంబానికి వ్యవసాయ భూమి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇంటికి వెళ్తే వ్యవసాయ పనుల్లో పాలుపంచుకుంటాడు. డబ్బు కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టనని, తనకు ఎంతివ్వాలో వారికి తెలుసని నవాజుద్దీన్ అన్నాడు. బాలీవుడ్ నిర్మాతలు తెలివైన వారని, ప్రతిభను ప్రోత్సహించడంలో, ప్రతిభకు సరిపడా పారితోషికం ఇవ్వడంలో వారిని తప్పుపట్టలేమని చెప్పాడు. 'కిక్', 'భజరంగీ భాయ్ జాన్', 'మాంఝీ', 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్', 'బద్లాపూర్', 'లంచ్ బాక్స్' వంటి సినిమాల్లో నటనతో అభిమానుల మనసులను సిద్దిఖీ గెల్చుకున్నాడు.

  • Loading...

More Telugu News