: క‌న్న‌య్యా.. ద‌మ్ముంటే బ‌హిరంగ చ‌ర్చ‌కు రా: ఓ బాలిక‌ సవాల్


జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియ‌న్ ప్రెసిడెంట్ క‌న్న‌య్య కుమార్ కు ఓ 15 ఏళ్ల బాలిక సవాల్ విసిరింది. "ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం చాలా తేలిక.. ద‌మ్ముంటే క‌న్న‌య్య బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాలి" అంటూ లూధియానాకు చెందిన బాలిక జాహ్నవి సవాల్ విసిరింది. ఇంత‌కీ ఎవ‌రీ బాలిక.. అనుకుంటున్నారా..? సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే జాహ్నవి గతంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసాపత్రం అందుకుంది. దేశద్రోహం కేసుపై జైలు నుంచి బెయిలుపై విడుద‌లైన క‌న్న‌య్య మోదీపై చుర‌కలు అంటిస్తూ ప్ర‌సంగించ‌డంతో జాహ్న‌వి స్పందించింది. ఎక్కడైనా, ఎప్పుడైనా స‌రే బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరింది. ప్రధాని నరేంద్ర మోదీపైనా, ఆయన ప్రభుత్వంపైనా జేఎన్‌యూ స్టూడెంట్ యూనియ‌న్ నాయ‌కుడు చేస్తున్న విమర్శలను తప్పుపట్టింది. ప్రధానిపై క‌న్న‌య్య‌ చేసిన, చేస్తున్న విమర్శలన్నీ పూర్తి అవాస్తవాలని పేర్కొంది. మోదీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలకు కాకుండా...దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారి గురించి క‌న్న‌య్య మాట్లాడి ఉండాల్సిందని జాహ్న‌వి అన్నారు

  • Loading...

More Telugu News