: నేను చెబుతాను...అంతవరకు ఆగండి: మీడియాతో బిపాసాబసు
తన పెళ్లి గురించి తాను చెప్పేవరకు ఆగాలని బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసాబసు తెలిపింది. 'అలోన్' సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో బిపాసా ప్రేమలో పడింది. గతంలో డినో మోరియా, హర్మాన్ బవేజా, సైఫ్ అలీ ఖాన్, జాన్ అబ్రహాంలతో పీకల్లోతు ప్రేమలో పడిన బిపాస, ఎవరినీ పెళ్లాడలేదు. ఇక, ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్న కరణ్ సింగ్ గ్రోవర్ రెండో భార్యకు విడాకులు ఇంకా ఇవ్వలేదు. అయినప్పటికీ వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బిపాసా బసు వేలికి ఉంగరం కనిపించడంతో మీడియా వివాహం గురించి ప్రశ్నించింది. దీనిపై స్పందించిన బిపాస, వివాహం గురించి వెల్లడిస్తానని, తాను పెళ్లి గురించి చెప్పే వరకు ఆగాలని సూచించింది. కాగా, ప్రియుడు కరణ్ కు అతని భార్య నుంచి ఇంకా విడాకులు మంజూరు కాకపోవడంతో వివాహం గురించి జాప్యం జరుగుతోందని బాలీవుడ్ కథనాలు వినిపిస్తున్నాయి.