: రానా భుజమెక్కిన బన్నీ...నెటిజన్ల ఆదరణ
సినీ నటుడు రానా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. దీంతో ఇది సోషల్ మీడియాలో సినీ అభిమానుల షేర్లతో హల్ చల్ చేస్తోంది. గత రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో 'సెన్సేషన్ సంగీతఝరి' జరిగింది. దీనికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకకు ధీమ్ 'వైట్ అండ్ వైట్' ను ఎంచుకున్నారు. అంటే ఇందులో పాల్గొనేవారంతా తెల్లని దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఇక ఈ షోలో సెలబ్రిటీలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను టాలీవుడ్, బాలీవుడ్ టార్జాన్ రానా తన భుజాలపై ఎక్కించుకున్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన రానా, డానికి 'వాట్ ఏ షో... గైస్' అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి సినీ అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. దీనికి లైకులు, కామెంట్లు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.