: దమ్ముంటే చర్చకు రా...తొక్కి పడేస్తా: టీడీపీ నేతకు మంత్రి మాణిక్యాలరావు సవాల్


పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి మంత్రి మాణిక్యాలరావు సవాలు విసిరారు. చేతనైతే, దమ్ముంటే తాడేపల్లిగూడెం నుంచి ఢిల్లీ వరకు ఎక్కడైనా బహిరంగ చర్చకు సిధ్ధమని సవాలు విసిరారు. తాను ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం చేస్తానని తెలిపారు. ఆయన ఏం చేయాలో తాను చెప్పనని, ఆయనది నీచమైన స్థాయి అని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల అండతో తాడేపల్లిగూడెంలో రౌడీయిజం చేయాలని చూస్తే తొక్కిపడేస్తానని ఆయన అన్నారు. పట్టణంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News