: రావెల సుశీల్ ను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన పోలీసులు
నిర్భయ చట్టంపై కేసు నమోదు కావడంతో విమర్శలు ఎదుర్కోలేక మంత్రి రావెల కిశోర్ తన కుమారుడు సుశీల్ ను గత రాత్రి పోలీస్ స్టేషన్ లో అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో సుశీల్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, ఫార్మాలిటీస్ పూర్తి చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తుర్కయాంజెల్ లో ఉన్న న్యాయమూర్తి నివాసానికి నిందితులు సుశీల్, డ్రైవర్ రమేష్ లను తీసుకెళ్లి హాజరుపరిచారు. నిర్భయ చట్టంపై కేసు నమోదు కావడంతో అతనిని రిమాండ్ కు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.