: సాక్షిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ధూళిపాళ్ల
సాక్షి పత్రికపై గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రిక, ఛానెల్ లో తనపై అసత్య కథనాలు ప్రసారం చేశారని, దీంతో తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని పేర్కొంటూ ఆయన పొన్నూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో జగన్, సాక్షి ఛానెల్, సాక్షి పేపర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ ఘటనలో 12 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా, రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల భూదందా పేరిట సాక్షిలో కథనాలు ప్రసారమైన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టే అవకాశం ఉందని, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని నేతలకు పార్టీ అధ్యక్షుడు సూచించిన సంగతి తెలిసిందే. అనంతరం సాక్షిపై కేసు నమోదు కావడం విశేషం.