: రాజమహేంద్రవరం చేరుకున్న అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం (రాజమండ్రి) చేరుకున్నారు. అక్కడి ఆర్ట్స్ కళాశాల మైదానంలో నేటి సాయంత్రం బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజమండ్రి చేరుకున్నారు. బహిరంగ సభ సందర్భంగా ఆయన చేయనున్న ప్రసంగంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ లో ఏపీకి కేంద్రం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై టీడీపీ మండిపడుతోంది. ఇలాంటి సమయంలో అమిత్ షా బహిరంగ సభను నిర్వహించడం అవసరమా? అని సాక్షాత్తూ మిత్రపక్షం ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన ఏపీ రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.