: మోదీ...స్మృతీ ఇరానీని మర్చిపోయారు
వివిధరంగాల్లో మహిళలు ప్రత్యేకతను చాటుకుంటున్నారని మోదీ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో మహిళా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలు తమ శక్తిని నిరూపించుకుంటున్నారని అన్నారు. మనలో నిక్షిప్తమై ఉన్న శక్తిని తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ శక్తిని నిత్యజీవితంలో ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. నిత్యజీవితంలో చుట్టుపక్కల ఉన్నవారితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. ఇలా వివిధ సందర్భాల్లో కలుసుకున్న వారితో భావాలను పంచుకుంటే సరికొత్త అంశాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. అలా మనమేధోసంపత్తిని పెంచుకోవాలని ఆయన సూచించారు. మహిళలు వివిధ రంగాల్లో సత్తాచాటుతూ, దేశం పేరుప్రతిష్ఠలు ఇనుమడింపజేస్తున్నారని ఆయన చెప్పారు. అలాగే ఎన్డీయే హయాంలోని ప్రభుత్వంలో లోక్ సభ స్పీకర్ గా, విదేశాంగశాఖ మంత్రిగా మహిళలే ఉన్నారని అన్నారు. అయితే, కేబినెట్ లో ఉన్న మరోమహిళా మంత్రి స్మృతీ ఇరానీ పేరు ప్రస్తావించడం మర్చిపోయారు.