: ప్రభల సందడి షురూ... కిటకిటలాడుతున్న కోటప్పకొండ!


నరసరావుపేటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం, త్రికోటేశ్వరుడు కొలువైవున్న కోటప్పకొండ, శివరాత్రికి ఒక రోజు ముందుగానే భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోవడంతో, ప్రైవేటు వాహనాలను అనుమతించరాదని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే చీరాలతో పాటు శ్యావల్యాపురం, సంతమాగులూరు, నకిరికల్లు తదితర ప్రాంతాల నుంచి విద్యుత్ ప్రభలు కోటప్పకొండకు బయలుదేరాయి. ప్రభల కోసం ఓ మార్గాన్ని వదిలిన అధికారులు, యాత్రికులను చేరవేసేందుకు మునుమాక నుంచి మార్గాన్ని సిద్ధం చేశారు. భక్తుల రాక పెరిగే కొద్దీ బస్సుల ట్రిప్పులను పెంచుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న వినుకొండ, చిలకలూరి పేట, సత్తెనపల్లి, మాచర్ల, చీరాల తదితర డిపోల నుంచి 200కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News