: ప్రియురాలు సహా భర్తను స్తంభానికి కట్టేసి కొట్టిన మహిళ!


తనను వదిలేసి మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఓ యువతి, భర్తను, అతని ప్రియురాలినీ స్తంభానికి కట్టేసి మరీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా చర్ల నివాసి కాశీ విశ్వనాథ్ కు ఆరేళ్ల క్రితం శ్యామలతో వివాహమైంది. ఓ బిడ్డ పుట్టిన తరువాత, ఆమెను వదిలేసిన విశ్వనాథ్ మరో యువతిని చేరదీసి, హోటల్ నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్యామల తన ఊరి నుంచి వచ్చి భర్తను, ప్రియురాలినీ, అదే హోటల్ ముందున్న స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని విడిపించి, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News