: ఖమ్మం 22వ డివిజన్ లో దొంగ ఓటర్లు... వైకాపా, కాంగ్రెస్ ధర్నా


ఖమ్మం నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా 22వ డివిజన్ ఇందిరానగర్ లో టీఆర్ఎస్ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని, తక్షణం పోలింగ్ నిలిపివేయాలని వైకాపా, టీడీపీ పార్టీలు డిమాండ్ చేశాయి. అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పాల్పడుతోందని వీరు నిరసనకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ షాపులో సుమారు 700కు పైగా దొంగ ఓటరు కార్డులు లభించాయని వైకాపా నేతలు ఆరోపించారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుడికి చెందిన షాపు ఇదని, పోలీసులు చూస్తూ కూడా తరువాత కేసు నమోదు చేస్తామని చెబుతున్నారే తప్ప, చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఓటర్ల లిస్టులో ఓ ఫోటో, ఐడీ కార్డుపై మరో ఫోటో ఉన్నప్పటికీ, ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారని విమర్శించారు. విషయం తెలుసుకున్న వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించిన పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News