: ఉస్మానియాకు రావెల సుశీల్... ఆరోగ్యం బాగుందన్న డాక్టర్లు!


గత రాత్రి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయిన ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్, ఆయన కారు డ్రైవర్ లను కొద్దిసేపటి క్రితం పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అక్కడ ఆయనకు బీపీ తదితర పరీక్షలు నిర్వహించిన వైద్యులు సుశీల్ ఆరోగ్యం బాగానే ఉందని నివేదికను ఇచ్చారు. ఆపై తిరిగి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు, ఉదయం 10 గంటల తరువాత మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారని తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్డుపై ఓ ముస్లిం మహిళను కారులోకి బలవంతంగా లాగాడన్న ఆరోపణపై, సుశీల్ మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News