: జేఎన్యూ వేస్ట్... సరైనోడు ఒక్కడన్నా బయటకు వచ్చాడా?: కట్జూ సంచలన వ్యాఖ్యలు


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరుగుతున్న రీసెర్చ్ వృథా అని, ఆ వర్శిటీ నుంచి దేశానికి ఉపయోగపడే ఒక్క ఆలోచన కూడా రాలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సంచలన విమర్శలు చేశారు. ఒక్క విద్యార్థి కూడా వినూత్న ఐడియాతో బయటకు రాలేదని అన్నారు. "ఇటీవలి కాలంలో జేఎన్యూ పేరు దేశవ్యాప్తంగా, విదేశాల్లో సైతం మారుమోగుతోంది. ఆలోచనలకు, వాక్ స్వాతంత్ర్యానికీ కేంద్రమని అంటున్నారు. నాకు మాత్రం అలాంటి అభిప్రాయం లేదు. వర్శిటీని ప్రారంభించిన నాటి నుంచి ఒక్క వినూత్న ఆలోచన లేదా సిద్ధాంతం వచ్చాయా? నేనైతే వినలేదు" అని తన ట్విట్టర్ ఖాతాలో కట్జూ వ్యాఖ్యానించారు. అమెరికాలోని హార్వార్డ్, బర్క్ లీ, స్టాన్ ఫోర్డ్ వంటి వర్శిటీల నుంచి రీసెర్చ్ లు జరిపిన వారు ఎంతో మంది నోబెల్ బహుమతులు పొందారని, జేఎన్యూలో జరిగిన అసలైన రీసెర్చ్ ఒక్కటన్నా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వర్శిటీలో జరిగే రీసెర్చ్ విలువలేనిదని అన్నారు.

  • Loading...

More Telugu News