: స్మృతీ ఇరానీకి స్వల్పగాయాలు... తృటిలో తప్పిన ప్రాణాపాయం!


కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆమె కాన్వాయ్ యమునా ఎక్స్ ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న వేళ, ముందు వెళుతున్న పోలీసు వాహనాన్ని స్మృతి కారు ఢీ కోంది. గత రాత్రి ఈ ఘటన జరిగింది. ఎక్స్ ప్రెస్ వేపై ఓ కారు ప్రమాదం జరుగగా, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అయింది. దీన్ని గమనించని స్మృతి కాన్వాయ్ లోని ముందు వాహనాలు షడన్ బ్రేకు వేయాల్సి రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమె ఎడమ ముంజేయి, కుడి కాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేయించుకున్న ఆమె, ప్రమాదం గురించిన వివరాలను ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. తాను క్షేమంగా ఉన్నానని, ప్రమాదంలో గాయపడిన వారు ఆసుపత్రికి చేరుకున్నారని ధ్రువీకరించుకున్న తరువాతనే తాను అక్కడి నుంచి వెళ్లానని వివరించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News