: సిద్ధరామయ్య ధరించినది స్మగుల్డ్ వాచ్... సీబీఐ విచారణకు బీజేపీ పట్టు!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాచీ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాఫ్తు జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కన్నడ నాట ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప డిమాండ్ చేశారు. ఆయన ధరించినది స్మగుల్డ్ వాచీ అని, దాన్ని ఇండియాకు ఎలా తీసుకువచ్చారో తేల్చాల్సి వుందని ఆయన అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి స్మగ్లింగ్ ను ప్రోత్సహిస్తున్నందునే సీబీఐ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని, లక్షల ఖరీదు చేసే వాచీ వ్యవహారంలో న్యాయ పోరాటానికి దిగుతామని చెప్పారు. ముఖ్యమంత్రిపై మంత్రుల్లోనే నమ్మకం పోతున్నదని వ్యాఖ్యానించిన యడ్యూరప్ప, అందువల్లే ఆయన విందు ఇచ్చినా, సగం మంది హాజరు కాలేదని విమర్శించారు.