: కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించిన మంత్రి రావెల కిశోర్


మహిళను వేధించిన కేసులో తన కుమారుడు రావెల సుశీల్ ను ఏపీ మంత్రి రావెల కిశోర్ స్వయంగా బంజారాహిల్స్ స్టేషన్ లో పోలీసులకు అప్పగించి వెళ్లారు. ఈ కేసులో ఉచ్చు బిగుస్తున్నందున, పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నందున, ఇక వేచిచూడరాదని భావించిన రావెల తన కుమారుడు, ఆయన డ్రైవర్ ను గత రాత్రి 11 గంటలకు స్టేషన్ కు తీసుకువచ్చారు. ఆపై కిశోర్ అక్కడి నుంచి వెళ్లిపోగా, ఒంటి గంట సమయంలో సుశీల్ స్వయంగా వచ్చి లొంగిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. నేడు కోర్టుకు సెలవు కావడంతో న్యాయమూర్తి ఇంటికి సుశీల్ ను తీసుకువెళ్లవచ్చని సమాచారం. అంతకన్నా ముందు వైద్య పరీక్షల నిమిత్తం సుశీల్ ను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News