: అసిస్టెంట్ కు బైక్ కొనిచ్చా: సినీ హీరో నిఖిల్
'అసిస్టెంట్ నరసింహకు బైక్ కొనిచ్చా' అని టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా బైక్ పై సరదాగా కూర్చున్న ఫోటోను పోస్టు చేసిన నిఖిల్...బజాజ్ కంపెనీ తయారు చేసిన ఆ స్పోర్ట్స్ బైక్ చాలా బాగుందని పేర్కొన్నాడు. నరసింహకు బైక్ కొనివ్వడం చాలా ఆనందంగా ఉందని నిఖిల్ తెలిపాడు. కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని నిఖిల్ అన్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదని చెప్పాడు. కాగా, 'హ్యాపీడేస్' సినిమాతో తెరంగేట్రం చేసిన నిఖిల్, 'కార్తికేయ' సినిమాతో మంచి విజయం చవిచూసిన సంగతి తెలిసిందే.