: పాక్ క్రికెటర్ల భద్రతపై నవాజ్ షరీఫ్ ఆరా
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా ఈనెల 19న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన టీట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెటర్ల భద్రతపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరాతీశారు. అంతేకాదు, ధర్మశాలలో పాక్ ఆటగాళ్ల భద్రత విషయంపై ఒక నిర్ణయానికి రావడానికి ప్రత్యేకంగా ఒక టీంను భారత్ కు పంపాల్సిందిగా పాక్ అంతర్గతశాఖ మంత్రి చౌధురి నాసిర్ అలీని ఆయన ఆదేశించారు. ఈ టీం నివేదిక అందే వరకు పాక్ జట్టు టీట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొనడంపై నిర్ణయాన్ని ఆయన పెండింగ్ లో పెట్టారు. ఆటగాళ్ల భద్రతపై నాసిర్ అలీ ప్రధానికి వివరించారు. దీంతో భారత్ లోని పాక్ హైకమిషనర్ తో మాట్లాడి, ఆటగాళ్ల భద్రతపై నిర్ధారించుకుని నివేదిక ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే బంగ్లాదేశ్ లో పాక్ జట్టు ప్రదర్శన గురించిన నివేదికను కూడా ఆయన కోరినట్టు తెలుస్తోంది.