: పశ్చిమగోదావరిలో దారుణం... యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది!
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కేతపర్రులో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించిన చినవెంకులు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇంటర్ పరీక్షల కోసం ఒంటరిగా చదువుకుంటున్న సమయంలో, ఇంట్లోకి ప్రవేశించిన చినవెంకులు ఆమెను ప్రేమించాలని వేధిస్తూ, బలవంతం చేశాడు. దీంతో ఆమె అతనిని ప్రతిఘటించింది. దాంతో ఆగ్రహించిన చినవెంకులు తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను ఆమెపై పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రగాయాలపాలైన బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిందితుడు చినవెంకులు చాలాకాలంగా ఆమెను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న చినవెంకులు కోసం గాలింపు చేపట్టారు.