: యాపిల్ 'ఐ ఫోన్' అంటే పడిచస్తున్న నేరగాళ్లు!


అమెరికాలో యాపిల్ ఐఫోన్ లు నేరగాళ్లకు మంచి నేస్తాలైపోతున్నాయి. ఇవి తమకోసమే పుట్టుకొచ్చాయన్న ఆనందాన్ని వారికి ఇస్తున్నాయి. అందుకే, అక్కడి లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, నేరగాళ్లు యాపిల్ ఐఫోన్ లను విరివిగా వాడుతున్నారంటూ న్యాయస్థానానికి విన్నవించారు. దీనికి కారణం, యాపిల్ ఐఫోన్ ను హ్యాక్ చేసి డీకోడ్ చేయడాన్ని మొబైల్ దిగ్గజం యాపిల్ వ్యతిరేకించడమే! దీనిని అవకాశంగా తీసుకున్న నేరగాళ్లు యాపిల్ ఐఫోన్ ను కొనుగోలు చేస్తున్నారని లా ఎన్ ఫోర్స్ మెంట్ పేర్కొంది. హ్యాక్ చేయడానికి వీలుకాని సాంకేతిక పరిజ్ఞానం దేవుడిచ్చిన వరం అంటూ యాపిల్ ఐఫోన్ కలిగిన నేరగాడు, మరో నేరగాడితో సాగించిన సంభాషణను దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించారు. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను డీకోడ్ చేయడంలో ఎఫ్బీఐకి సహకరించేందుకు యాపిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో నేరగాళ్లు యాపిల్ ఫోన్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టు దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు.

  • Loading...

More Telugu News