: సచివాలయంలో సీఎం చంద్రబాబు... ఛాంబర్ లో మంత్రులతో భేటీ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చాలా కాలం తర్వాత హైదరాబాదులోని సచివాలయానికి వచ్చారు. నేటి మధ్యాహ్నం ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం నిన్న రాత్రికే విజయవాడ నుంచి హైదరాబాదుకు చేరుకున్న చంద్రబాబు నేటి ఉదయం కొద్దిసేపటి క్రితం సచివాలయంలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు సచివాలయానికి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సచివాలయంలోని ‘ఎల్’ బ్లాకులో కొత్తగ రూపుదిద్దుకున్న తన ఛాంబర్ లోకి వెళ్లిన చంద్రబాబు... అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. మరికాసేపట్లో అక్కడి నుంచి నేరుగా ఆయన అసెంబ్లీ ప్రాంగణానికి బయలుదేరనున్నారు.

  • Loading...

More Telugu News