: కన్నయ్య కుమార్ నాలుక తెగ్గోస్తే... రూ.5లక్షల బహుమానం: బీజేవైఎం నేత ఆఫర్


దేశద్రోహులకు మద్దతుగా నినాదాలు చేసిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ నాలుకకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నాయకుడు ఒకరు వెల కట్టారు. వెర్రి వేయి తలలు వేసినట్టు... కన్నయ్యకుమార్ నాలుక తెగ్గోసిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించేశారు. దేశద్రోహం కేసులో కన్నయ్యకుమార్ గత నెల 12న అరెస్ట్ కాగా, ఢిల్లీ హైకోర్టు ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో గురువారం విడుదలైన విషయం తెలిసిందే. పార్లమెంట్ పై దాడి దోషి అఫ్జల్ గురు తనకు ఆదర్శం కాదని, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల తనకు మార్గదర్శకుడని కన్నయ్య విడుదల సందర్భంగా ప్రకటించిన విషయం కూడా విదితమే. కాగా, జేఎన్ యూ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 9న జరిగిన కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ లోని బుదాన్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు కుల్ దీప్ వర్ష్ నే ఖండించారు. ఆ రోజు యూనివర్సిటీలో జరిగినదాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అది దేశ ద్రోహమా? కాదా? అనేది కోర్టు తేల్చాల్సి ఉందని, న్యాయవ్యవస్థ, రాజ్యాంగం పట్ల తమకు నమ్మకముందని అన్నారు. జాతి వ్యతిరేక నినాదాలు చేయడం ద్వారా కన్నయ్య ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకున్నాడని వర్ష్ నే అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ అడుగు ముందుకు వేసి పై ఆఫర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News