: చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు చెల్లింపులు పూర్తి... తుది విడతగా రూ.1.26 కోట్లు విడుదల
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జిల్లాల్లో పర్యటించేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు చెల్లింపులన్నీ పూర్తయ్యాయి. మొత్తం బుల్లెట్ ప్రూఫ్ తో తయారైన ఈ బస్సును ప్రభుత్వం చండీగఢ్ కు చెందిన జేసీబీఎల్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. ఈ బస్సు విలువ రూ.5.05కోట్లు కాగా ఇప్పటికే వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం మెజారిటీ సొమ్మును చెల్లించింది. ఇంకా మిగిలిపోయిన రూ.1.26 కోట్లను విదుదల చేస్తూ నిన్న ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల విడుదలతో బస్సు విలువ మొత్తాన్ని జేసీబీఎల్ కు చెల్లించినట్లైందని ఆయన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.