: ‘డబుల్’ అదుర్స్!... కేసీఆర్ దత్తత గ్రామాల్లో సిద్ధమైన డబుల్ బెడ్ రూం ఇళ్లు


రెండు పడక గదులు, సువిశాలమైన హాలు, కిచెన్, టాయిలెట్స్... ఇవీ తెలంగాణ సర్కారు పేదలకు ప్రకటించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలోని వసతులు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించి పేదలకు అందజేస్తామని అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. అయితే ఇది సాధ్యమేనా అని అంతా అనుమానంగా చూశారు. అసాధ్యమనేది ఏదీ లేదని తెలంగాణ సర్కారు తేల్చేసింది. మెదక్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలో సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవలి, నరసన్నపేట గ్రామాల్లో అధికారులు డబుల్ బెడ్ రూం ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిన్న కేసీఆర్ సదరు ఇళ్లను స్వయంగా సందర్శించారు. ఇళ్ల లోగిళ్లను సునిశితంగా పరిశీలించారు. నిర్మాణాలపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం... ఇంటీరియర్స్ ను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంచి ముహూర్తం చూసుకుని పేదలతో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రవేశం చేయిద్దామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News