: నారా రోహిత్ నా కంటే నాటీయా?: బాలయ్య
'ఆర్టిస్టు అన్నాక విభిన్నమైన పాత్రలు పోషించాలని నందమూరి బాలకృష్ణ అన్నారు. సావిత్రి' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఇందాక ఈ సినిమా హీరోయిన్ మాట్లాడుతూ, హీరో మంచి కోఆపరేటివ్ ఆర్టిస్టని చెప్పిందని, అంటే 'రోహిత్ నా కంటే నాటీయా?' అని బాలయ్య నవ్వుతూ చమత్కరించారు. వీరిలా పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్లే పాత్రలు తాను చేస్తే ఎవరూ చూడరని అన్నారు. తన పోలికలు కూడా రోహిత్ కు రావాలని బాలయ్య అన్నారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన నాటీ కామెంట్స్ కి అభిమానులు కేరింతలు కొట్టారు.