: ఈమధ్య కాలంలో ఇంతగా కష్టపడే హీరోని రోహిత్ లోనే చూస్తున్నాను: తారకరత్న


ఈమధ్య కాలంలో తనకు తెలిసి చాలా కష్టపడుతున్న హీరో నారా రోహిత్ అని నటుడు తారకరత్న కితాబు ఇచ్చాడు. 'సావిత్రి' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, నిజాయతీగా కష్టపడుతున్న రోహిత్ సినిమాలు విజయవంతం కావాలని తారకరత్న ఆకాంక్షించాడు. 'సావిత్రి' సినిమా 'సోలో' కంటే పెద్ద హిట్ అవుతుందని తెలిపాడు. ఈ సినిమాకు అద్భుతమైన సాంకేతిక నిపుణులు పని చేస్తే, ఇందులో టాలెంటెడ్ ఆర్టిస్టులు నటించారని తారకరత్న తెలిపాడు. ఈ సినిమా విజయవంతం అవుతుందనడానికి మరో కారణం ఏంటంటే, ఈ ఆడియో బాబాయ్ బాలయ్య చేతులమీదుగా విడుదల కావడమని చెప్పాడు.

  • Loading...

More Telugu News