: యువరాజ్ సింగ్ రికార్డును నేను సమం చేయలేదు: మిథాలీ రాజ్
టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సుల రికార్డును భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ సమం చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో, పలు ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై మిథాలీరాజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదానని, యువరాజ్ సింగ్ రికార్డు సమం చేశానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లని తెలిపింది. తాను ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టలేదని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత్ లో న్యూజిలాండ్ తో ఆడిన సందర్భంగా ఒకే ఓవర్ లో ఎక్కువ పరుగులు సాధించినప్పటికీ ఆరు సిక్సర్లు కొట్టలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో నకిలీదని, పలు సందర్భాల్లో కొట్టిన షాట్లను ఎడిట్ చేశారని ఆమె స్పష్టం చేసింది.