: వారిద్దరి కలయిక వెనుక సల్మాన్?
బాలీవుడ్ దంపతులు అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ విడిపోతున్నారని వార్తలు వెలువడ్డాయి. మలైకా దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని, అతనితో డేటింగ్ కూడా చేస్తోందని పలు కథనాలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే మలైకా, అర్భాజ్ లు గత కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. దాంతో, మలైకా తన కొడుకుని తీసుకుని తన చెల్లెలు ఇంటికి దగ్గర్లో ఓ ఇల్లు తీసుకుని అక్కడికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలసి వ్యాఖ్యాతలుగా వ్యవహరించాల్సిన 'సూపర్ కపుల్' షో వాయిదా పడుతుందని కూడా వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఇంటికి వచ్చిన మలైకా తన కుటుంబంతో సంతోషంగా గడిపింది. ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో భర్తతో కలసి మలైకా డాన్స్ కూడా చేసిందని సమాచారం. దీంతో విడిపోతారని అంతా భావిస్తున్న క్రమంలో వీరి కలయిక వెనుక సల్మాన్ హస్తం ఉందని బాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు. తన పెద్ద సోదరుడు ఆందోళనగా ఉండడంతో రంగంలోకి దిగిన సల్మాన్ రెండు కుటుంబాలకు చెందిన పెద్దలతో మాట్లాడి, సమస్యను సరిదిద్దినట్టు తెలుస్తోంది.