: అసోంలో రెండు, పశ్చిమ బెంగాల్ లో ఆరు విడతలుగా ఎన్నికలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోంలో రెండు విడతలుగా, పశ్చిమ బెంగాల్ లో ఆరు విడతలుగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 4, 11 తేదీల్లో అసోంలో రెండు విడతలు, పశ్చిమ బెంగాల్ లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఏప్రిల్ 17న రెండో విడత, 21న మూడో విడత, 25న నాల్గో విడత, 30న ఐదో విడత, మే 5న ఆరో విడత ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నజీమ్ జైదీ వెల్లడించారు.