: ఇవాళ రాజకీయాలు మాట్లాడను: చంద్రబాబు


నిత్యమూ అభివృద్ధి కోసం తపిస్తున్న తాను, వైకాపా నేతలు చేస్తున్న తుచ్ఛ రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శించుకున్న అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సాక్షి పత్రికలో వస్తున్న 'భూదందా'లపై తాను నేడు మాట్లాడనని ఆయన అన్నారు. ఆ విషయమై మరో రోజు మాట్లాడుకుందామని, నేడు, ఓ పవిత్ర కార్యక్రమం కోసం తాను వచ్చానని చంద్రబాబు తెలిపారు. పైగా పక్కనే స్పీకర్ కోడెల ఉన్నందున రాజకీయం మాట్లాడటం తగదని చెప్పారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలపడమే తన కర్తవ్యమని అన్నారు. కోటప్పకొండ అభివృద్ధికి అన్ని రకాలుగా నిధులిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News