: చంద్రబాబు పిలిస్తే తెదేపాలోకి వెళ్లేందుకు సిద్ధమంటున్న మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదయం బాపట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన, బాబు పిలిస్తే ఎటువంటి షరతులూ పెట్టకుండానే వెళ్తానని తెలిపారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తే తప్పేమీ లేదని, ఈ విషయంలో పేపర్లలో వార్తలు రాసే బదులు, ఆధారాలతో హైకోర్టులో కేసు వేసి సీబీఐ విచారణ కోరవచ్చని వైకాపాకు సలహా ఇచ్చారు. రాజధాని నిర్మిస్తున్న 29 గ్రామాలను వదిలి బయటి గ్రామాల్లో భూములు కొంటే తప్పేంటని గాదె ప్రశ్నించారు.