: హాయ్ ల్యాండ్ ను వేలం వేస్తాం!: వైసీపీ ఆరోపణలపై సీఐడీ అధికారుల వివరణ


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో టీడీపీ నేతల ‘భూదందా’పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది. కథనం ప్రసారమైన రోజే మీడియా ముందుకు వచ్చిన టీడీపీ నేతలు ‘సాక్షి’పై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత ఓ వైపు వైసీపీ నేతలు, మరోవైపు టీడీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు కలకలం రేపాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని హాయ్ ల్యాండ్ రిసార్ట్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. లక్షలాది మంది మధ్య తరగతి జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ కు చెందిన ఈ రిసార్ట్ ను సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లాగేసుకున్నారన్న వైసీపీ నేతల ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పికొట్టారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చేందుకు అగ్రిగోల్డ్ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు కూడా మీడియా ముందుకు వచ్చారు. అగ్రిగోల్డ్ కు చెందిన సదరు రిసార్ట్ ను ప్రభుత్వానికి అటాచ్ చేశామని చెప్పిన సీఐడీ అధికారులు, దానిని త్వరలోనే వేలం వేయనున్నామని ప్రకటించారు. రిసార్ట్ ను వేలం వేయగా వచ్చిన డబ్బును హైకోర్టు ద్వారా డిపాజిటర్లకు పంచుతామని కూడా సీఐడీ పేర్కొంది.

  • Loading...

More Telugu News