: మియాపూర్ లో హత్యకు గురైన రౌడీషీటర్
హైదరాబాద్ కు చెందిన ఒక రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మియాపూర్ లోని ప్రశాంత్ నగర్ గుడి వెనుక గల గుట్టల్లో ఈరోజు వెలుగుచూసింది. గుర్తుతెలియని దుండగులు జేపీ నగర్ కు చెందిన జనార్దన్ అనే రౌడీషీటర్ తలపై బండరాళ్లతో మోదీ హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.