: ఇక రా... రాజకీయాల్లోకి: కన్నయ్యపై వెంకయ్య


జైలు నుంచి బెయిలుపై విడుదలైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ పై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యంగ్యోక్తులు విసిరారు. జైలుకు వెళ్లి వచ్చిన తరువాత ఆయనకు మంచి పబ్లిసిటీ వచ్చిందని, ఇక రాజకీయాల్లోకి రావచ్చని సలహా ఇచ్చారు. కన్నయ్యకు ఇష్టమైన పార్టీ ప్రస్తుత పార్లమెంటులో రెండంకెల స్థానాలను సైతం దక్కించుకోలేదని, ఆమ్ ఆద్మీ పార్టీని పేరు చెప్పకుండా ప్రస్తావించారు. తనకు వచ్చిన ప్రచారంతో ఓ రాజకీయ నాయకుడు కాగల అవకాశాన్ని కన్నయ్య పొందాడని అన్నారు. కాగా, దాదాపు 20 రోజుల పాటు జైల్లో గడిపిన కన్నయ్య రాగా, భారీ సంఖ్యలో విద్యార్థులు స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News