: అజిత్, షాలినిల కొడుకు పుట్టినరోజు...చిన్ననాయకుడంటూ పోస్టర్లు
ప్రముఖ హీరో అజిత్, షాలిని దంపతుల కొడుకు అద్విక్ మొదటి పుట్టిన రోజు వేడుక జరిగింది. అయితే, అజిత్ కుటుంబసభ్యులు ఈ వేడుకను నిరాడంబరంగా జరుపుకున్నట్లు సమాచారం. కానీ, తమిళనాడులోని పలు ప్రాంతాలకు చెందిన అజిత్ అభిమానులు మాత్రం తమ హీరో కొడుకు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టీ తలా (చిన్న నాయకుడు) అనే పోస్టర్లను గోడలకు అంటించడం గమనార్హం. మధురైలో ఎక్కువగా ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అభిమానులు బిర్యానీతో విందు చేసుకున్నారు. అద్విక్ బర్త్ డే ఫంక్షన్ ఫొటోలను అజిత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, తన అభిమాన సంఘాలను అజిత్ రద్దు చేసి చాలా కాలం అవుతోంది.