: అమెరికన్ బృందానికి వీసా నిరాకరించిన కేంద్రం


అంతర్జాతీయ మత స్వేచ్ఛపై పనిచేస్తున్న యూఎస్ కమిషన్ ఇండియాకు వచ్చి ఓ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని భావించగా, వారికి వీసాను నిరాకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మతపరమైన హక్కుల ఉల్లంఘన జరుగుతుండటం, మత స్వేచ్ఛకు భంగం వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, వాటిపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వారం పాటు ఇండియాకు వచ్చి పరిశీలిస్తామని చెబుతూ యూఎస్ సీఐఆర్ఎఫ్ (యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్) అనుమతి కోరగా, మోదీ సర్కారు అంగీకరించలేదు. ఈ విషయాన్ని యూఎస్ సీఐఆర్ఎఫ్ చైర్మన్ రాబర్ట్ పీ జార్జ్ ఓ ప్రకటనలో వెల్లడిస్తూ, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు అసంతృప్తిని మిగిల్చిందని అన్నారు. పాకిస్థాన్, సౌదీ అరేబియా, వియత్నాం, చైనా దేశాల్లో సైతం తాము పర్యటనలు జరిపామని, ఆ దేశాలతో పోలిస్తే మరింత పారదర్శకంగా ఉండే ఇండియాకు వెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. కాగా, వీరికి వీసా నిరాకరణపై విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News