: గుండె మార్పిడికి సిద్ధంగా గుంటూరు ప్రభుత్వఆసుపత్రి
గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) త్వరలో మరో ఘనత సాధించనుంది. జీజీహెచ్ లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. గుండెమార్పిడి అవసరమైన తొమ్మిది మంది వ్యక్తులను గుర్తించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని జీవన్ దాస్ కేంద్రంలో ఒకరిపేరు ఇప్పటికే నమోదు చేశారు. పేరు నమోదు చేసుకున్న తర్వాత ఎవరైనా బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు సమాచారం వస్తే వారి గుండెను అమర్చడానికి వీలవుతుంది. ఈనెల 18లోపు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ శస్త్రచికిత్స జరిగితే మనదేశంలో ఈ ఘనత సాధించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీజీహెచ్ నాలుగోదిగా గుర్తింపు పొందనుంది.