: లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కన్నుమూత


వివాదరహిత రాజకీయ నేత, లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1988 నుంచి 1990 వరకూ మేఘాలయ ముఖ్యమంత్రిగా, 1996 నుంచి 1998 వరకూ 11వ లోక్ సభ స్పీకరుగా సేవలందించిన ఆయన, 1947 సెప్టెంబర్ 1న జన్మించారు. 8 సార్లు పార్లమెంటుకు ఎన్నికైన సంగ్మా ప్రస్తుతం మేఘాలయాలోని తురా (ఎస్టీ) నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. 2012లో రాష్ట్రపతి పదవి కోసం ప్రణబ్ ముఖర్జీపై పోటీపడి ఓటమి పాలయ్యారు. ఆయన కుమార్తె అగాధ సంగ్మా 15వ లోక్ సభకు ఎంపికై యూపీఏ హయాంలో మంత్రి పదవిని చేపట్టి, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. సంగ్మా కుమారుడు కోర్నాడ్ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ పార్టీలు, నేతలూ సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News