: ముఖ్యమంత్రి గారూ...మీ సంగతి నాకు తెలుసు, జగన్ కు ఏమి తెలుసు?: ముద్రగడ


‘నేను రాసిన లేఖను జగన్ చెబితే రాశానని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. అంటే, లేఖ రాసే పరిజ్ఞానం కూడా నాకు లేదా?’ అని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. మాటమాట్లాడితే జగన్ చెప్పినట్లు తాను నడుచుకుంటున్నానని, లేఖ రాశానని బాబు అనడం ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. ‘ఒకళ్ల మోచేతి కింద నీళ్లు తాగి నేను బతుకుతున్నానా?’ అంటూ ఆయన మండిపడ్డారు. ‘ఒక్క విషయం ముఖ్యమంత్రి గారూ..జగన్ గారి వయస్సు నా రాజకీయ జీవితమంత లేదు. మీతో సమంగా నేను కూడా ఎన్నిక కాబడ్డాను. జగన్ గారు.. నిన్నగాక మొన్న పుట్టాడు. మీ సంగతి ఆయనకేమి తెలుసు ... నాకు తెలుసు. ప్రతివిషయంలో జగన్ ప్రస్తావన తెస్తున్నారు. మీరు, నా ఫోన్లని, నా మనుషుల ఫోన్లని ట్యాప్ చేస్తున్నారు. కావాలంటే, నాతో జగన్ ఎన్నిసార్లు మాట్లాడారో కాల్ లిస్టు చూసుకోండి. ముఖ్యమంత్రి గారూ.. ఇవన్నీ రుజువు చేయమని ఛాలెంజ్ చేస్తున్నాను. నా ఉద్యమం వెనుక గానీ, ఉత్తరాల వెనుక గానీ, నా బ్రతుకుదెరువు వెనుక గానీ జగన్ గారి పాత్ర ఉందంటే ఈరోజు నుంచి ఉద్యమమే కాదు, నా కుటుంబం కూడా రాజకీయాల్లో ఉండదని సవాల్ చేస్తున్నాను. రుజువు చేయలేకపోతే.. మీరూ, మీ కుటుంబం రాజకీయాల నుంచి విరమిస్తారా?. ముఖ్యమంత్రి గారూ.. పిచ్చిగా మాట్లాడవద్దు’ అని ముద్రగడ తీవ్రంగా హెచ్చరించారు.

  • Loading...

More Telugu News